Hyderabad | యాకుత్‌పురాలో బాణసంచా పేలుడు.. దంపతులు మృతి
Hyderabad | హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కూతురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ దంపతులిద్దరూ దీపావళి పండుగ నేపథ్యంలో స్థానికంగా పటాకుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పటాకుల నిల్వలను ఉంచారు. రాత్రి ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి, బాణసంచాకు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడడంతో, అగ్నికీలల్లో చిక్కుకుని దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంట్లో బాణసంచా నిల్వలు ఉంచుకోవద్దని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Sadar festival | సదర్ ఉత్సవాలకు హర్యానా దున్నలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘గోల్ టూ’ దున్నపోతు
Real Estate | నత్తనడకన హైదరాబాద్ నిర్మాణ రంగం.. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

