Sadar festival | ముషీరాబాద్, అక్టోబర్ 28: మరో మూడు రోజుల్లో జరుగనున్న సదర్ ఉత్సవాల్లో సందడి చేయడానికి హర్యానాకు చెందిన దున్న రాజులు నగరానికి చేరుకున్నాయి. గోల్ టూ, విదాయక్, శ్రీకృష్ణ, షేరా నాలుగు దున్న రాజులను ముషీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత ఎడ్ల హరిబాబు యాదవ్ సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ముషీరాబాద్ సత్తార్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గోల్ టూ అనే దున్న ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కాగా, దాని యాజమాని నరేంద్ర సింగ్ పద్మశ్రీ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. గోల్ టూ దున్నపోతు ఆరు అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు, 1800 కిలోల బరువుతో దేశంలో అత్యంత ఖరీదైన దున్న గా నిలిస్తుందన్నారు. సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి.