కుత్బుల్లాపూర్ : పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో(Pet Basheerabad) ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకొని చీటింగ్ చేసిన(Cheating case) సంఘటనలో మహిళపై కేసు నమోదైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాంనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ దేవరాయంజల్ ప్రాంతంలో నిమ్మల కన్వెన్షన్ నిర్వా హకురాలు పూజ భర్త జలేంధర్ సహాయంతో గత కొన్ని రోజుల కిందట నరేశ్ అనే వ్యక్తి వద్ద రూ.20 లక్షలు తీసుకొని కన్వెన్షన్‌లో పూల డెకరేషన్ కోసం కాంట్రాక్ట్ ఇచ్చింది.
అతడికి తెలువకుండానే మరో వ్యక్తి సాయిచరణ్‌కు పూల డెకరేషన్‌ను కాంట్రాక్ట్‌ను అగ్రిమెంట్ చేసుకొని నరేశ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. దీనికి తోడు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందు లకు గురి చేస్తుండటంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కన్వెన్షన్‌హాల్ నిర్వాహకురాలు పూజపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.