జగద్గిరిగుట్ట,డిసెంబరు15 : బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసునమోదైంది. పోలీసులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. అల్విన్ కాలనీలో నివాసముండే బాలిక(16)కు తల్లిదండ్రులు లేరు. స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతూ నాన్నమ్మ సంరక్షణలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరునెలల క్రితం రైలులో పల్నాడుకు చెందిన యువకుడు (25) పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో సంబంధాలు కొనసాగిస్తున్న నిందితుడు తరచూ హైదరాబాద్ వచ్చివెళ్లేవాడు.
పలుసార్లు హౌసింగ్‌బోర్డు ప్రాంతంలోని ఓలాడ్జిలో లైగింకంగా లోబరుచుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా తొగించుకోవాలని సూచించడంతో పాటు ఫోన్లోనూ సరిగా స్పందించడంలేదు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికాగా అమె నాన్నమ్మ వైద్యుల వద్దకు తీసుకెళ్లగా గర్భం దాల్చిన విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలు ఆన్‌లైన్‌లై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగద్గిరిగుట్ట పోలీసులు సోమవారం సమాచారం సేకరించి బాధితురాలిని హాస్పిటల్‌కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.