Kacheguda | హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ కారు ప్రత్యక్షమైంది. కారును బ్రిడ్జి కిందనే నిలిపేసి అక్కడ్నుంచి క్షణాల్లో జారుకున్నాడు. గమనించిన ప్రయాణికులు, వాహనదారులు రైల్వే పోలీసులను, అధికారులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
ఇక కారును నిలిపి ఉంచిన ప్రాంతానికి పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. కారును ఈ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయితే కారు బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కారును వదిలేసి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.