Hyderabad | వెంగళరావునగర్, సెప్టెంబర్ 21 : కూల్ డ్రింక్ అనుకుని యాసిడ్ తాగేశాడు. దీంతో ఓ చిరు వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటన రహ్మత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన సుశాంత్‌కుమార్ సాహు (43) తమ కుటుంబంతో కలిసి రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటుంటారు. రహ్మత్‌నగర్ చౌరస్తాలో సాహు టీ స్టాల్‌ను నిర్వహిస్తుండగా.. అతని భార్య సుమిత్ర టీచర్‌గా పనిచేస్తుంటారు. బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్‌ను కొనుగోలు చేసిన సుమిత్ర ఖాళీ కూల్ డ్రింక్ బాటిళ్లల్లో నింపి వంటగదిలో దాచింది. ఈనెల 19వ తేదిన సాయంత్రం సాహు తన కుమార్తెను స్కూల్నుంచి ఇంటికి తెచ్చాడు. ఇంట్లో భోజనం చేశాక కూల్ డ్రింక్ తాగేందుకు కిచెన్ రూమ్‌లోకి వెళ్లాడు. కూల్‌డ్రింక్ అనుకుని యాసిడ్ బాటిల్‌ను తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు సాహుకు వైద్యం కోసం అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ దవాఖానాకు తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.