కుత్బుల్లాపూర్, డిసెంబర్ 15: ఇండస్ట్రీ ఇన్ క్యాంపస్ ఏర్పాటు చేసి శాస్త్ర విజ్ఞానంలో క్రాంతిగా వెలుగుతున్న కేఎల్ యూనివర్సిటీ నేటి ఏఐ యుగానికి అద్భుతమైన వేదికగా మారుతుందని ఆ వర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు అన్నారు. నమస్తే తెలంగాణ-కేఎల్ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘లక్ష్యం-2026.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్’ అనే అంశంపై సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ శ్రీచైతన్య ఇంటర్ కళాశాల ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా, నమస్తే తెలంగాణ అడ్వటైజ్మెంట్ విభాగం ఏజీఎం రాజిరెడ్డి, శ్రీచైతన్య కళాశాలల గ్రూప్ ఏజీఎం రవికుమార్, డీన్ బాలక్రిష్ణ, ప్రిన్సిపాల్ వీరబాబు తదితరులు
హాజరయ్యారు.
ఇంటర్ తర్వాతి కోర్సులపై అవగాహన
ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేఎల్ యూనివర్సిటీ పబ్లిసిటీ కోసమో.. మరోదాని కోసమో అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని అన్నారు. విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ లాంటి దిగ్గజ యూనివర్సీటీలతో సరిసమానంగా విద్యను అందించడమే లక్ష్యంగా మీ ముందుకు వస్తుందన్నారు.
ఈ ఏడాది 8వేల మందికి ప్లేస్మెంట్లు
ఈ ఏడాది వర్సిటీలో విద్యనభ్యసించిన 8 వేల మందికి ప్లేస్మెంట్లు అందించామని, శాటిలైట్ ప్రయోగాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించామన్నారు. విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో 26వ స్థానంలో కేఎల్ యూనివర్సిటీ ఉందన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా వంద కోట్ల విలువైన స్కాలర్షిప్ ద్వారా ఫీజుల్లో రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో ర్యాంకులు అందిపుచ్చుకోకపోతే అదే స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ అవకాశాలను కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ వేదిక చక్కటి అవకాశంగా చక్కటి అవకాశంగా చక్కటి అవకాశంగా చక్కటి అవకాశంగా చక్కటి అవకాశంగా చక్కటి అవకాశంగా నిలుస్తుందన్నారు. అనంతరం కళాశాలలో మెరిట్ సాధించిన పలువురు విద్యార్థులకు మెడల్స్ అందించి అభినందించారు.

Hyd2
పోటీ ప్రపంచంలో రాణించాలి
ప్రస్తుత ఏఐ పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించినప్పుడే తగిన గుర్తింపు ఉంటుందని శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం రవికుమార్ అన్నారు. అలాంటి వారికి వేధికగా కేఎల్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇంటర్ తర్వాత తమ లక్ష్యాలను ఎంచుకునేందుకు విద్యార్థులు ఇలాంటి అవగాహన సదస్సులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో కష్టపడి చదివిన తర్వాత పాయింట్ల రూపంలో ఐఐటీ, ట్రిబుల్‌ఐటీలో ప్రవేశాలకు కోల్పోయే విద్యార్థులు అనేక మంది ఉంటారన్నారు. అలాంటి వారు కేఎల్‌యూలో చేరితే విద్యార్థుల ఉజ్వళ భవిష్యత్‌కు నాంది పలుకుతుందన్నారు.
– రవికుమార్, ఏజీఎం, శ్రీచైతన్య విద్యాసంస్థలు
విద్యార్థులు లక్ష్యం వైపు సాగాలి
పోటీ ప్రపంచంలో ఏఐకి అనుసంధానంగా ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ముందస్తుగా కేరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే-కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు.. విద్యార్థుల్థ భవిష్యత్ అభ్యున్నతికి తొలిమెట్టుగా నిలుస్తుందన్నారు. విద్యార్థులకు ఏఏ ర్యాంకులు వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి..ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి..అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తుందన్నారు. అనుభమైన నిపుణుల ద్వారా విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు ఈ వేదికలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
– రాజిరెడ్డి, ఏజీఎం, నమస్తేతెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ విభాగం