కీసర, మే 11: క్రీడల్లో రాణించిన యువతకు చక్కటి భవిష్యత్ ఉంటుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోధుమకుంట మాజీ సర్పంచ్ స్వర్గీయ వంగేటి సత్తిరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. సత్తిరెడ్డి పేరుమీద గోధుమకుంటలో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సత్తిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు వంగేటి పర్వత్‌రెడ్డి క్రీడలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, మంచాల శ్రీనివాస్, గోధుమకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, యువకులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ టాపర్స్‌కు మంత్రి సత్కారం..
తెలంగాణలో విద్యారంగం నంబర్‌వన్ స్థాయిలో దూసుకెళ్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి భార్గవి పదవ తరగతిలో టాపర్‌గా నిలిచింది. దీంతో భార్గవిని గురువారం కీసర మండల బీఆర్ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. మంత్రి ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు, వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులే ఎక్కువ మంది టాపర్‌గా నిలువడం మన రాష్ర్టానికే గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయ ణ, సర్పంచ్‌లు ఆకిటి మహేందర్‌రెడ్డి, పుట్ట రాజుముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు బెలిదె రమేశ్‌గుప్తా, గుర్రం మల్లారెడ్డి, నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, సుజాత, పండుగ శశికాంత్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.