కొండాపూర్, ఫిబ్రవరి 3 : నడుస్తున్న ద్విచక్ర వాహనంలో ఒకసారిగా మంటలు చెలరేగిన ఘటన మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా వైపు తన ద్విచక్ర వాహనం(పల్సర్) పై వెళ్తున్న కొమనంతల జతిన్ కేబుల్ బ్రిడ్జి పైకి రాగానే ఒకసారిగి మంటలు చెలరేగాయి. గమనించిన జతిన్ బైక్ ను పకన ఆపడంతో ప్రమాదం తప్పింది. కాగా మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.