హైదరాబాద్: హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో (Yakutpura) ఓ చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మ్యాన్ హోల్ (Manhole) తెరచి ఉండటంతో ఆరేండ్ల బాలిక అందులో పడిపోయింది. గమనించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమై ఆమెను బయటకు తీశారు.
ఆరేండ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో వారిద్దరి కంటే ముందు నడుస్తున్న ఆ చిన్నారి.. రోడ్డుపై తెరచి ఉన్న మ్యాన్ హోల్‌ను గమనించలేదు. దీంతో ప్రమాద వశాత్తు అందులో పడిపోయింది. అయితే వెనకే వస్తున్న ఆమె తల్లి గమనించి వెంటనే బయటకు తీసింది. దీంతో ఆ చిన్నారని ప్రాణాలతో బయటపడింది. అయితే మూత తెరిచి ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉంటే రహదారిపై మ్యాన్ హోల్ తెరచి ఉంచడం ఏంటని, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సీసీ ఫుటేజ్.. ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయిన ఆరేళ్ల చిన్నారి
హైదరాబాద్ – యాకుత్‌పురాలోని పాతబస్తీలో ఓపెన్ డ్రెయిన్‌లో పడిపోయిన 6 సంవత్సరాల బాలిక
అప్రమత్తమై వెంటనే బాలికను అందులో నుంచి బయటకుతీసిన తల్లి
మూత తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని.. అధికారులు ఇలా నిర్లక్ష్యంగా… pic.twitter.com/jzfjv2s5xT
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2025