మెహిదీపట్నం/సుల్తాన్‌బజార్, అక్టోబర్ 21: దీపావళి పండుగ సందర్భంగా పటాకులు పేలి 54 మందికి కంటి గాయాలు అయ్యాయి. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించివేశారు. మరో ఇద్దరికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చుతూ నగరంలోని పలు ప్రాంతాలలో 54 మంది కండ్లకు గాయాలు చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇచ్చి పంపించి వేశామని ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తెలిపారు. కాగా, మరో 8 మందికి ఉస్మానియా దవాఖానాలో చికిత్సలు అందిస్తున్నట్లు దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ రఫీ తెలిపారు.