Drugs | హైదరాబాద్ : సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. గత మూడేండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ రకాల డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ధ్వంసం చేసిన డ్రగ్స్ 5 వేల కిలోల వరకు ఉంటాయని పేర్కొన్నారు. 30 పోలీసు స్టేషన్ల పరిధిలో 122 కేసుల్లో డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. 2,600 లీటర్ల హాష్ ఆయిల్, కొకైన్‌ను కూడా ధ్వంసం చేశారు. హైదరాబాద్ సమీపంలోని బయో మెడికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.