జూబ్లీహిల్స్లో 40తులాల ఆభరణాలు చోరీ
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రోడ్ నెం.2లోని జూబ్లీ బాల్పార్క్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న వ్యాపారి మహ్మద్ తమీమ్ ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషి కావాలంటూ గత ఏడాది అక్టోబర్లో ఉర్దూ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన ఫహ్మీదా బేగం (55) అనే మహిళ రెండుసార్లు వాట్సప్ ద్వారా కాల్ చేసి ఆసక్తి కనబర్చింది. తనకు కొన్ని పనులున్నాయని, వాటిని పూర్తి చేసుకున్న తర్వాత పనిలో చేరుతానంటూ చెప్పింది.
బంజారాహిల్స్, ఏప్రిల్ 27: జూబ్లీహిల్స్లో నివాసముంటున్న వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రోడ్ నెం.2లోని జూబ్లీ బాల్పార్క్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న వ్యాపారి మహ్మద్ తమీమ్ ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషి కావాలంటూ గత ఏడాది అక్టోబర్లో ఉర్దూ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన ఫహ్మీదా బేగం (55) అనే మహిళ రెండుసార్లు వాట్సప్ ద్వారా కాల్ చేసి ఆసక్తి కనబర్చింది. తనకు కొన్ని పనులున్నాయని, వాటిని పూర్తి చేసుకున్న తర్వాత పనిలో చేరుతానంటూ చెప్పింది. ఈ మేరకు ఈనెల 7న ఫహ్మీదాబేగం పనిలో చేరి అక్కడే నివాసముంటోంది. రెండ్రోజుల తర్వాత యజమాని తమీమ్తోపాటు అతడి భార్య అరీజ్ మిర్జాతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లారు.
ఈనెల 11న తనకు ఊర్లో అర్జెంట్ పని ఉందంటూ ఫహ్మీదా బేగం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో మరో పనిమనిషిని ఉద్యోగంలో పెట్టుకున్నారు. కాగా ఈనెల 24న ఫంక్షన్కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో బెడ్రూమ్లోని కప్బోర్డును తెరిచి చూడగా అక్కడ ఉండాల్సిన వజ్రాభరణాలు, 40తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. రెండు డైమండ్ నెక్లెస్లు, బంగారం నెక్లెస్లు, గాజులు, బ్రాస్లెట్, ఉంగరాలు మాయమయ్యాయని బాధితుడు మహ్మద్ తమీమ్ సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో రెండ్రోజుల పాటు పనిచేసిన ఫహ్మీదా బేగం చోరీకి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

