MMTS Trains | కొత్తగా 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఈ నెల 1 నుంచే అందుబాటులోకి
MMTS Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్ - లింగంపల్లి, మేడ్చల్ - హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్ – లింగంపల్లి, మేడ్చల్ – హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకున్నారు.
- సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడుస్తున్న మూడు వందేభారత్ రైళ్లకు వీలుగా ఉండే విధంగా ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన నూతన టైమ్టేబుల్ విడుదల చేశారు. అందుకోసం సికింద్రాబాద్ – ఉమ్దానగర్, ఫలక్నుమా – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నామన్నారు.
- ప్రతి రోజు ఉదయం మేడ్చల్లో ఉదయం 7.20, సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, లింగంపల్లి నుంచి ఉదయం 10.20, రాత్రి 6.10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం సర్వీసులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే, మేడ్చల్-హైదరాబాద్కు సంబందించిన సర్వీసు ఉదయం 11.50 గంటలకు మేడ్చల్లో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్లో స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

