Book Fair | నేటితో ముగియనున్న బుక్ ఫెయిర్
ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.
- భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు
- డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ..
Book Fair | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 : ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఆదివారం కావడంతో పుస్తకప్రియులు భారీగా తరలివచ్చారు. స్టాల్స్ కలియతిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. విభిన్న రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో పుస్తక ప్రేమికులతో స్టాల్స్ అన్నీ సందడిగా మారాయి. మరోవైపు రవ్వా శ్రీహరి వేదికపై పలు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.
ఎన్టీఆర్ స్టేడియంలోని గద్దర్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్, వీక్షణం వేణుగోపాల్, ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త పసునూరి రవీందర్ పుస్తక సమీక్షలో మాట్లాడుతూ… ఈ పుస్తకం తెలంగాణ సాహిత్య చరిత్రకు పెద్దబాలశిక్ష లాంటిదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపయోగపడే దినుసులాంటిదని చమత్కరించారు. డాక్టర్ సింగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుడిపాటి, కాసుల ప్రతాప్రెడ్డి, డాక్టర్ ఎస్.రఘు, ఉప్పాల శ్రీరామ్ తదితరులు పుస్తకంపై ఉపన్యసించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

