హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన 38 కాపర్ బండిల్స్‌ను చోరీ చేసిన ముగ్గురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి కాపర్ బండిల్స్ , వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాపర్ బండిల్స్‌ను కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపర్ బండిల్స్ ను అంబులెన్స్‌లో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.