ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 28: సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ‘సీ’ గ్రౌండ్లో శుక్రవారం టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత, అపర భగీరథుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా టోర్నమెంట్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి శుభదినంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్రావు, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ బోయిళ్ల విద్యాసాగర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామ్యేల్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకులు కొంపల్లి నరేశ్, విద్యార్థి నాయకులు వీరబాబు, మంద సురేశ్, కోతి విజయ్, శిగ వెంకట్, ఆవాల హరిబాబు, నవీన్ గౌడ్, కృష్ణ, మంతెన మధు, శ్రీకాంత్ గౌడ్, మూర్తి, జంగయ్య, రవి నాయక్, వేల్పుకొండ వెంకటేశ్, కురువ పల్లయ్య, ఒగ్గు శివ, రేణు, బాలరాజ్, భరత్ పాల్గొన్నారు.