అబిడ్స్ ఏప్రిల్4: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి 25 సంవత్సరాల జైలు శిక్ష ఐదువేల జరిమానా విధిస్తూ శుక్రవారం 12వ అడిషనల్ సెషన్స్ జడ్జి టి .అనిత తీర్పునిచ్చారు. ఈ మేరకు మంగళ్ హాట్ ఇన్స్పెక్టర్ మహేశ్ గౌడ్ వివరాల ప్రకారం.. ఓల్డ్ మల్లేపల్లి సీతారాంబాగ్ ప్రాంతంలో నివసించే సత్యనారాయణ చారి 2022లో తన ఇంటి సమీపంలో నివసించే మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఈ కేసును ముందుగా బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటన జరిగిన ప్రాంతం మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో మంగళహాట్ పోలీసులు కేసును అన్ని కోణాలలో విచారించి సత్యనారాయణ చారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన12వ అడిషనల్ సెషన్స్ జడ్జి టి.అనిత శుక్రవారం నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను దక్షిణ పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ అభినందించారు.
పహాడి షరీఫ్, ఏప్రిల్ 4: లైంగిక దాడికి పాల్పడిన ఒకరికి పదేండ్ల జైలు శిక్ష పడింది. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి వివరాల ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం వెళ్తూ తన కుమార్తెను బాలాపూర్‌లో ఉండే స్నేహితుడు సయ్యద్ హాజీకి అప్పగించాడు. అయితే హాజీ ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడగా.. ఇంటికి చేరుకున్న అమ్మాయి జరిగిన విషయం తండ్రికి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2022లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. కేసు పూర్వాపరాలు తెలుసుకున్న న్యాయమూర్తి శుక్రవారం నిందితుడికి పదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.