శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 29, 2020 , 23:47:03

గ్రేటర్‌లో మరో 7పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో మరో 7పాజిటివ్‌ కేసులు

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా గ్రేటర్‌లో మాత్రం కరోనా పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో  గ్రేటర్‌ వ్యాప్తంగా బుధవారం మరో 7కేసులు నమోదయ్యాయి.  కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కొనసాగుతుండడంతో నగర వాసులకు ఉత్కంఠత తప్పడంలేదు. ఈనెల 27న  గ్రేటర్‌లో కేవలం   రెండు కేసులు నమోదవగా 28న నాలుగు కేసులు పెరిగి 6కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారంతో పోల్చితే మరో కేసు పెరిగి బుధవారం 7కేసులు నమోదయ్యాయి.


logo