గురువారం 28 మే 2020
Hyderabad - Apr 08, 2020 , 23:40:45

‘దేవుడి తరువాతి స్థానం మీదే’

‘దేవుడి తరువాతి స్థానం మీదే’

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి వైద్యులు నాయకత్వం వహిస్తున్నారని, ప్రతి వైద్యుడికి, వైద్య సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. బుధవారం సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లి అక్కడ వైద్యులను సన్మానించారు. ‘వైద్యులూ మీకు కృతజ్ఞతలు.. దేవుడి తరువాత స్థానం మీదే’నంటూ ప్లకార్డులు పట్టి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ నగర పోలీసులు, హైదరాబాద్‌ ప్రజల తరఫున వైద్యులు, నర్సులు, టెక్నికల్‌ స్టాఫ్‌ దవాఖాన ఇతర సిబ్బంది, సాఫాయికర్మచారి సేవలను కొనియాడుతూ వారిని సన్మానిస్తున్నామన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని దవాఖానల్లో వైద్యులు 24 గంటలు పనిచేస్తూ కరోనా బాధితులకు సేవలు చేస్తూ, వైరస్‌ కట్టడికి పనిచేస్తున్నారని, వారందరికీ హైదరాబాద్‌ పోలీసుల తరపున సెల్యూట్‌ చేస్తున్నానని సీపీ అన్నారు.


logo