ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 17, 2020 , 01:14:16

టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం

టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం

టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. అదివారం సూరారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

దుండిగల్‌ : టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. అదివారం సూరారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలపై ఒకొక్కరుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రజల మనసుల్లో నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెన్నంటి నిలుస్తామని, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ పుట్టిన రోజును పురస్కరించుకొని కేసీఆర్‌ మాస్క్‌లు ధరించి కేక్‌ను కట్‌ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఈచ్‌వన్‌.. ప్లాంట్‌వన్‌ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు. కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ టీఆర్‌ఎస్‌ఇజం పేరుతో జ్ఞాపికలను బహుకరించారు. అంతకుముందు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన సుమారు 200మంది కార్యకర్తలు తొలిసారిగా కలుసుకోవడంతో ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకోవడంతో పాటు ఆలింగనం చేసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో బారపటి ప్రవీణ్‌కుమార్‌, బగ్గికోటీశ్వర్‌, పోతుల నరేందర్‌రెడ్డి, నిఖిల్‌గౌడ్‌, దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo