Ganja | హైదరాబాద్ : నగరంలోని ధూల్‌పేటలోని బాబా టెంపుల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మహేశ్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఫరూక్ అనే వ్యక్తి వద్ద 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఏరియాలోని అలంఘర్ ప్రాంతంలో దీపక్ రాజ్ అనే యువకుడి వద్ద 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఇతరులకు గంజాయిని విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా రెండు కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి పట్టుకున్నటీమ్లో సీఐ మహేశ్, ఎస్ఐ రూప, హెడ్ కానిస్టేబుల్ భూపాల్ ఉన్నారు. ఈ బృందాన్ని హైదరాబాద్ ఏసీ అనిల్ కుమార్ రెడ్డి, ఏఈఎస్ స్మిత సౌజన్య అభినందించారు.