కోటి వృక్షార్చన నాటిన మొక్కలు 18 లక్షలు
హరితహారంతో నగరం పచ్చగా కళకళలాడుతున్నది. హరితవనంగా మారుతున్నది. యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది.
- సిటీలో ముమ్మరంగా తొమ్మిదో విడత హరితహారం
- వర్షాలు తగ్గడంతో మరింత వేగంగా ప్రక్రియ
- ఒక్కో కాలనీ యూనిట్‌గా.. గ్రీన్ యాక్షన్ ప్లాన్
- పూలు, పండ్ల మొక్కలకు అధిక ప్రాధాన్యం
- డిసెంబర్ నాటికల్లా టార్గెట్ పూర్తి
సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ) : హరితహారంతో నగరం పచ్చగా కళకళలాడుతున్నది. హరితవనంగా మారుతున్నది. యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, బల్దియా అర్బన్ బయో డైవర్సిటీ విభాగం గ్రీన్ యాక్షన్ ప్లాన్ పేరుతో రంగంలోకి దిగింది. ఒక్కో కాలనీని యూనిట్‌గా తీసుకొని.. ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా పూలు, పండ్ల మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నది. అక్కడి పార్కులను సైతం ఆహ్లాదకరంగా మార్చుతున్నది. ఇటీవల వర్షాలతో హరిత ప్రక్రియ కాస్త ఆలస్యమైనా.. వానలు తగ్గుముఖం పట్టడంతో మొక్కలు నాటే పనులను వేగవంతం చేశారు అధికారులు. శుక్రవారం వరకు 18.10 లక్షల మొక్కలను నాటారు. డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తి చేయనున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో విడత పనులను జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం మరింత ముమ్మరం చేసింది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో ఒక్కో జోన్‌కు 20 లక్షలు, చార్మినార్, సికింద్రాబాద్‌లో ఒక్కో జోన్‌కు 14 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 12 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే గ్రీన్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఒక్కో కాలనీని యూనిట్‌గా తీసుకుని కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా పూలు, పండ్ల మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కాలనీ పార్కులను పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చుతున్నారు. ఇటీవల వర్షాలతో హరితహారం కాస్త జాప్యం జరిగినా.. వానలు తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాటి వరకు 18.10 లక్షల మొక్కలు నాటినట్లు వచ్చే డిసెంబర్ నాటికల్లా లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

