TGSRTC | సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): ఉజ్జయినీ మహంకాళి బోనాలను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
శనివారం నగర వ్యాప్తంగా బోనాలకు తరలివచ్చే భక్తులకు 175 బస్సులను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. ఈనెల 21, 22న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏమైనా బస్సుల ఆలస్యం సమస్యలు ఉంటే 9959226147, 9959226143, 9959226130 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.