ఖైరతాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం 15వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. వివిధ విభాగాల్లో జరిగిన ఈ రన్లను సైబరాబాద్ సీపీ రమేశ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు జోనల్ హెడ్ ప్రశాంత్ షిండే, ఎన్ఎండీసీ డైరెక్టర్ (పర్సనల్) కృష్ణ కుమార్ ఠాకూర్, డీసీపీ కె. శిల్పవల్లి, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, రేస్ డైరెక్టర్ రాజేశ్ ప్రారంభించారు. ఈ పరుగు గచ్చిబౌలి వరకు సాగింది.