అంబర్‌పేట, మార్చి 13: నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. 15 ఏండ్లలో జరుగని అభివృద్ధిని మూడేండ్లలో చేశామన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ పోచమ్మబస్తీలో రూ.9లక్షలు, జంజం మసీదు వద్ద రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో అధ్వానంగా మారిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీరు, డ్రైనేజీ పైపులైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, మిర్యాల రవీందర్, బంగారు శ్రీను, శివాజీయాదవ్, నవీన్‌యాదవ్, బీజేపీ నాయకులు చుక్క జగన్, రంగంపల్లి రాజు, అచ్చిని రమేశ్, అచ్చిని మహేశ్, తదితరులు పాల్గొన్నారు.