హయత్‌నగర్, ఫిబ్రవరి8:ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.8.50 లక్షలు విలువైన గంజాయి, కారును స్వాధీ నం చేసుకున్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు శనివారం కేసు వివరాలను వెల్లడించా రు. ఛత్తీస్‌గఢ్, జగ్జల్ దేవ్పూర్కు చెందిన లేడీడాన్ సునీతాదాస్, కారు డ్రైవర్ ఇస్తియాఖురేషి, కంకన్ సనతో కలిసి కారులో సీటు వెనుక భాగంలో ప్రత్యేకంగా అలమరలు ఏర్పాటు చేసి గంజాయిని దాచారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నట్లుగా న మ్మిస్తూ ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్, ధూల్‌పేటలోని ఓ వ్యాపారికి గంజాయిని అందజేసేందుకు వెళ్తున్నారు.
పక్కా సమాచారం మేరకు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్డీ సీఐ నాగరాజు, సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేయగా.. ఎవరికీ అనుమానం రాకుండా కారు వెనుక సీటు కింద భాగంలో తరలిస్తున్న గంజాయిని గుర్తించా రు. సునీతాదాస్తోపాటు ఇస్తియాఖురేషి, కం కన్ సనతోపాటు రూ.3.50 లక్షలు విలువైన కారు, రూ.5 లక్షలు విలువైన గంజాయిని హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించా రు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
సిటీబ్యూరో :అమీర్‌పేట్ ఎస్ఆర్నగర్లో ఎస్టీఎఫ్ బృందం శనివారం దాడులు నిర్వహించింది. 1.132 కేజీల గంజాయి, ఒక సెల్‌ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నది. ఒకరిని పట్టుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ భిక్షారెడ్డి తెలిపారు.