సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జలమండలి వాణిజ్య(కమర్షియల్) నల్లా కనెక్షన్ల బకాయిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఆరు నెలలు, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే కనెక్షన్లను తొలగించాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులకు సూచించారు. ఇందుకుగాను రెవెన్యూ వసూలు బృందాలకు సహాయకంగా జలమండలి విజిలెన్స్ విభాగాన్ని సైతం రంగంలోకి దింపుతున్నట్లు పేరొన్నారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, సింగిల్ విండో సెల్ , తదితర అంశాలపై ఆయన అధికారులతో విసృ్తత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ ఆరు నెలలు, అంతకంటే ఎకువ రోజుల నుంచి బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల వినియోగదారులు మొత్తం1095 ఉన్నట్లు గుర్తించారు. వీరినుంచి రూ.8.31 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఆరు నెలలు, ఆపై బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిల విషయంలో కఠినంగా ఉండాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.
ఉచిత నీటి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
నాన్ ఫ్రీ వాటర్ సీమ్(నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని)పరిధిలో ఉన్న కనెక్షన్ల బకాయిలపైన కూడా దృష్టి సారించాలని, ఈ బకాయిలను సైతం వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను ప్రభుత్వం రద్దు చేసిందని, ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. వీరు ఇప్పటికైనా ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి నుంచి పథకం వర్తిస్తుందని, బకాయిలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఓఅండ్ఎం డైరెక్టర్ అజ్మీరా కృష్ణ , సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, పాల్గొన్నారు.