సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేసిన కమిషనర్..టార్గెట్ చేధించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. 30వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించిన వారికే ఈ 5 శాతం రిబెట్ ఉంటుందని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
బుధవారం వరకు 2.4 లక్షల మంది ఎర్లీబర్డ్ను సద్వినియోగం చేసుకోగా…తద్వారా రూ. 147 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెలాఖరు నాటికల్లా లక్ష్యాన్ని చేరాలని ఆ దిశగా డీసీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు చేర్చడం, విస్తృత అవగాహన కల్పించనున్నారు.