Hyderabad | శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పలు విద్యాసంస్థల బస్సులను వనస్థలిపురం వద్ద మన్నెగూడ ఆర్టీఏ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న 10 స్కూల్ వ్యాన్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సుల్లో భాష్యం, శ్రీచైతన్య, ఆదిత్య, నారాయణ విద్యాసంస్థల బస్సులు ఉండటం గమనార్హం.
వాహనాల ఫిట్నెస్ లేకపోవడం, నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలను వాడటం, రోడ్డు నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం తదితర కారణాల కారణంగా 10 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం ప్రమాదకరమని తెలిసినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ మన్నెగూడ ఆర్టీవో సుభాశ్ చంద్ర రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మున్ని తదితర అధికారులు తెలిపారు.