Ganja | హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 5.42 లక్షల విలువ చేసే 10.8 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న వారిని ఎం అర్జున్(18), వీ శ్రీనివాస్(20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని తెలిపారు. ఒడిశాలోని బెహ్రాంపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రైల్లో గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడకు ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించగా, వారిద్దరిని ఇక్కడే అరెస్టు చేశారు. పట్టుబడ్డ ఇద్దరు యువకులు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు తేలింది.