KTR | హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్ననే అందుబాటులో ఉన్న గౌరవ శాసనసభ్యులమందరం కూడా కన్నెపల్లి పంప్‌హౌజ్ దగ్గరకి పోయినం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో 10 కిలోమీటర్ల ఇవతలి వైపు కన్నెపల్లి పంప్‌హౌస్ ఉన్నది. నిన్న అక్కడికి పోయి చూసినం.. దేశమంతా, రాష్ట్రమంతటానేమో వర్షాల్లేవు. 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నయ్. వర్షం తక్కువ పడ్డది. రైతు ఆకాశం దిక్కు చూస్తున్నడు. కానీ అక్కడికి పోతే లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నయన్నారు.
కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిండంటే మొత్తం ఎక్కడైనా సరే కరువున్నా.. వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్ దగ్గర నీళ్లుంటయో ఆ పాయింట్ వెతికి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. అక్కడ పోయి చూస్తే లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి ఉత్తగనే పోతున్నయ్. అందుకే నిన్న అక్కడికి పోయి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినం. అయ్యా ముఖ్యమంత్రి మీకు మా మీద కోపముంటే కేసులు పెట్టుకో, ఏమన్నా చేసుకో.. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. కన్నెపల్లి పంప్ దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నయ్. అక్కడ నువ్వు చేయాల్సిందల్లా రెండు పంపులు ఆన్ చేస్తే చాలు. మొత్తం రాష్ట్రమంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సుభిక్షమైతది. దయచేసి ఆ పని చెయ్ అంటే చేస్తలేడన్నారు.
ముఖ్యమంత్రికి తెలుసు.. నీళ్లిచ్చినం అనుకో.. యూరియా ఇయ్యాలి.. మరి యూరియాఇస్తే పంట పండుతది. పంట పండితే మళ్లీ పంటలు కొనాలే. పంటలు కొంటే మద్దతు ధర ఇయ్యాలే. మద్దతు ధర ఇస్తే మళ్లీ బోనస్ ఇయ్యాలి.. ఈ లొల్లంతా ఎందుకు..? నీళ్లు ఇయ్యకపోతే ఏ లొల్లీ లేదన్నట్టు ఇయ్యాళ్ల నీళ్లుండి కూడా పంటలను ఎండపెడుతున్నడని మండిపడ్డారు. రైతులను తొక్కుతున్నడని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో.. కానీ రైతుల మీద పగ తీర్చుకోకు
రాష్ట్రంలో వర్షాలు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయి
కరువు ఉన్నా, వర్షాలు పడకపోయినా గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండే ప్రాంతం తెలుసుకొని కేసీఆర్… https://t.co/UIA8S2pC7c pic.twitter.com/aoFHOGBcKj
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2026