నగరంలో ఓటు నమోదుకు పట్టభద్రుల అనాసక్తి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు హైదరాబాద్ గ్రాడ్యుయేట్లు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు 15వేల లోపు మాత్రమే ఓటర్లుగా దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా తయారు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. గతంలో ఓటు ఉన్న వారు సైతం తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
- తొమ్మిది జిల్లాల నుంచి 1.45 లక్షల మంది ఓటర్లుగా నమోదు
- 40 వేలకు పైగా దరఖాస్తులతో మొదటి స్థానంలో రంగారెడ్డి
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ జోరందుకుంది. కొత్తగా ఓటర్ జాబితా రూపకల్పన చేపడుతుండటంతో పట్టభద్రుల నుంచి దరఖాస్తులు భారీగా నమోదు అవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జిల్లాల నుంచి బుధవారం నాటి వరకు ఫారం-18 కింద మొత్తం 1,45,634 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసారి నమోదులో అత్యధికంగా అభ్యర్థులు డిజిటల్ విధానాన్నే ఎంచుకుంటున్నారు. వచ్చిన మొత్తం అప్లికేషన్లలో ఆన్లైన్ ద్వారా 98 శాతం రాగా, ఆఫ్ లైన్ ద్వారా కేవలం 80 దరఖాస్తులు మాత్రమే అందినట్లు చెప్పారు.
ఓటర్ల నమోదులో రంగారెడ్డి జిల్లా 40వేలకు పైగా దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలవగా, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 5,822 దరఖాస్తులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు 15వేల లోపు మాత్రమే ఓటర్లుగా దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. మరోవైపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది.
ఇప్పటివరకు క్షేత్రస్థాయి పరిశీలనలో కేవలం ఒక దరఖాస్తును మాత్రమే ఆమోదించగా, మిగిలిన 1,32,981 దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా తయారు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గతంలో ఓటు ఉన్న వారు సైతం ఈసారి తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 6 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, నవంబరు 25 ముసాయిదా ఓటరు జాబితా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

