కందుకూరు, డిసెంబర్ 13 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని ఇప్పటి నుంచి కష్టపడి పని చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాటలను ప్రజలు నమ్మకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అగర్మియగూడ సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, జంగారెడ్డి, దాసర్లపల్లి, దెబ్బడగూడ మాజీ సర్పంచ్‌లు తాండ్ర దేవేందర్, డ్యారంగుల జంగయ్య, జల్పల్లి కౌన్సిల్ శంషోద్దిన్. యూసూబ్ పటేల్, లచ్చానాయక్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డికి శుభాకాంక్షలు
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కాలనీవాసులు సిరూర్ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ప్రభాకర్‌రావు, కుమార్, విజయ్‌రావు, ఓంకుమార్, స్వామిరెడ్డి, వీర్రాజ్, నాగేశ్వర్ రావు, రామారావు, దామోదర్, దుర్గా ప్రసాద్, రామకృష్ణ ఉన్నారు,
నేడు విజయోత్సవ సభ
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో గురువారం సాయంత్రం మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి విజయోత్సవ ర్యాలీ, అభినందన సభ ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సబితమ్మ విజయానికి కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల నాయకులందరూ పాల్గొనాలని తెలిపారు.