సేవా కార్యక్రమాలు నిర్వహించిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 18: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంతో పాటు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయడ ంలో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.