రాష్ట్రంలోనే ఐదవది.. మేడ్చల్‌లో మొదటిది..
రూ.1.13 కోట్ల నిధులతో ఏర్పాటు
నిర్వహణ బాగుండాలి.. ఉత్తమ అవార్డు రావడం ఖాయం
ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, ఫిబ్రవరి 11 : పట్టణాలు, పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకారం అందించి పరిశుభ్రతకు పాటుపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డు ప్రాంగణంలో రూ.1.13 కోట్ల నిధులతో శానిటేషన్ రిసోర్స్ పార్కు పేరుతో నిర్మించిన ‘మానవ విసర్జితాల శుద్ధీకరణ’ (ఎఫ్ఎస్టీపీ) కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజారోగ్యానికి పరిశుభ్రత అంత్యంత అవసరమని, వ్యర్థాలను కూడా శుద్ధి చేయడం వల్ల పరిసరాలు కలుషితం కాకుండా చూసుకోవచ్చని తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలో శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోనే ఇది ఐదవ ప్లాంట్ అని చెప్పారు. ఈ కేంద్రం నిర్వహణతో మేడ్చల్‌కు భవిష్యత్‌లో ఉత్తమ అవార్డులు రావడం ఖాయమని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు దేవరాజ్, ప్రియాంక మధుకర్ యాదవ్, మానస శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ యాదవ్, మహేశ్, ఉమానాగరాజు, సుహాసిని, శివకుమార్, కో ఆప్షన్ సభ్యురాలు గీతామధుకర్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ప్రియధర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, నాయకులు నర్సింహా రెడ్డి, రవీందర్‌రెడ్డి, మల్లేశ్ గౌడ్, మధుకర్ యాదవ్, రవీందర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.