టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
వనస్థలిపురం, ఫిబ్రవరి 18: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అపహాస్యం చేస్తున్న రేవంత్‌రెడ్డి కబోదిలా వ్యవహరిస్తున్నాడని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహారావు అన్నారు. ఫుట్‌బాల్‌కు రేవంత్‌రెడ్డి ఫొటోలు పెట్టి కాళ్లతో తన్ని ఆడుతూ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసినా.. టీపీసీసీ చీఫ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో సాధిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. అది చూసి ఓర్వలేక.. తలతిక్కగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని, నోరుజారితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, గొరిగె ప్రదీప్, బత్తుల నాగార్జునగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.