వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అదృష్టం కలిసివస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వారాంతంలో ఖర్చులు పెరగవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పెద్దల సలహాలు పాటించడం వల్ల పనులు నెరవేరుతాయి.
పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. అధికారులతో, బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందులకు హాజరవుతారు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు పెట్టడం మంచిది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారవేత్తలకు కాలం కలిసివస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. శుభకార్య నిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు సహకరిస్తారు. విదేశీ ప్రయాణాలు వాయిదాపడవచ్చు.
మంచివారితో సంబంధాలు పెంపొందుతాయి. రోజువారీ కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి పురోగతి ఉంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారిని నిధుల లేమి వెంటాడుతుంది. రుణం చేయాల్సి రావొచ్చు. కొత్త పనులు చేపట్టకుండా, చేతిలో ఉన్నవాటిని పూర్తిచేయడంపై దృష్టి సారించడం మంచిది. వారాంతంలో చికాకులు దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
వారం ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి ద్వారా పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఈ వారం అదృష్టం కలిసివస్తుంది.
వారం మధ్యలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. వారాంతానికి సర్దుకుంటాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నతమైన ప్రతిభ కనబరుస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. పెద్దల సలహాలు పాటించడం ద్వారా లబ్ధి పొందుతారు. ఇంట్లో శుభకార్యం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాల ద్వారా పనులు నెరవేరుతాయి. ఖర్చులు తగ్గుతాయి. భూములు, నిర్మాణ రంగంలో ఉన్నవారికి పనులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలుత ఆటంకాలు ఎదురైనా.. వారాంతంలో పనులు పూర్తవుతాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆదాయమూ పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. అదృష్టం కలిసివస్తుంది. రైతులకు దిగుబడి పెరుగుతుంది.
పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట దొరుకుతుంది. రాజకీయ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పనివారితో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. అందరితోనూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. సహోద్యోగుల సహకారం ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిళ్లు రావొచ్చు. శుభకార్య ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
శని మినహా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులకు హాజరవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా.. ఇప్పటికే ప్రారంభించిన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. వ్యాపారం విషయంలో నలుగురితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
విందులకు హాజరవుతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. అన్నిరంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూ లావాదేవీల్లో గణనీయమైన లాభాలు గడిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మంచివారి స్నేహం కోసం ప్రయత్నిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు.
కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సంగీతం, సాహిత్యంపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు చేతికి అందడం ఆలస్యం అవుతుంది. రోజువారీ వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నలుగురికి సహాయం చేస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. వారాంతంలో ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది.
ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు రావచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. వాహన మరమ్మతులు ముందుకురావొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. గృహ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి.