ప్రణాళికా బద్ధంగా పనులు చేస్తారు. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు ముందుకొస్తాయి. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. రోజువారీ వ్యాపారంలో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం అవసరం. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. రాబడికి తగిన ఖర్చులు ఉంటాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
భవిష్యత్ ప్రణాళికలను వ్యూహాత్మకంగా అమలుపరుస్తారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు మిశ్రమ కాలం. అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సలహాలు పాటిస్తారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. కోర్టు కేసుల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. వ్యాపారులు సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవాటిని పూర్తిచేయడంపై దృష్టి సారించడం అవసరం. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వారాంతంలో ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గం కారణంగా ఖర్చులు ముందుకు రావచ్చు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవన విధానంలో మార్పులు కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు అమలుచేస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సహోద్యోగులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దవారి సలహాలు పాటించడం అవసరం. వ్యాపారులకు మంచి సమయం. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సర్దుబాట్లు అవసరం అవుతాయి. ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రాబడి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహం అందుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంయమనంతో వ్యవహరించడం అవసరం. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రయాణాల వల్ల అలసట పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో, అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. తల్లిదండ్రుల సహకారంతో కొన్ని కార్యాలు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వ్యాపారులకు మంచి సమయం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.
కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తిచేస్తారు. అధికారుల అండ దండలు ఉంటాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారులకు మంచి సమయం. విద్యార్థులు చక్కగా రాణిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది.
బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. సంయమనంతో వ్యవహరిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. శివారాధన చేసుకోండి.
పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.