Weekly Horoscope | మేషం
పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉన్నత ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణం, మరమ్మతులు చేపడతారు. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి.
వృషభం
ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం. అధికారుల అండదండలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. పనుల్లో అదృష్టం కలిసివస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు వెలువడుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
మిథునం
నలుగురి సహకారం లభిస్తుంది. శ్రమ అధికమైనా అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. పారిశ్రామికవేత్తలు సమస్యలను అధిగమిస్తారు. రావలసిన సొమ్ము కొంత అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు లాభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
కర్కాటకం
కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. వాహనాల మరమ్మతులు ముందుకురావచ్చు. రాజకీయ పనులు త్వరగా నెరవేరుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల వారం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి.
సింహం
భూముల వ్యవహారం కలిసివస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రాజకీయ పనులలో కార్య సాఫల్యం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు మంచి సమయం.
కన్య
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. కొత్త పరిచయాలతో పనులు పూర్తవుతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు మంచి సమయం. తోటివారి సహకారం లభిస్తుంది. పదోన్నతి అవకాశం ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
తుల
వ్యాపారం లాభదాయకం. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. మిత్రుల కలయికతో ఖర్చులు పెరుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు సమయం అనుకూలంగా ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
వృశ్చికం
ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసాఫల్యం ఉంది. అదృష్టం కలిసివస్తుంది. ఆత్మీయులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు
వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పనిభారంతో అలసట పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. కార్యసాధనపై మనసు నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం
అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసులలో సానుకూల తీర్పు వెలువడుతుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు.
కుంభం
ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి సమయం. రాబడి పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది.
మీనం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. ఆత్మీయులతో విభేదాలు తలెత్తవచ్చు. వృథా చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
Kottankulangara Devi Temple | ఈ ఆలయంలో పురుషులకు నో ఎంట్రీ.. చీర కట్టుకుంటే మాత్రం రానిస్తారు