తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వాహనం, భూముల వలన ఖర్చులు రావచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మంచిది.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పదోన్నతి లభించవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.
పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. సంయమనం అవసరం. ఖర్చులు తగ్గించుకోవాలి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు. కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. విద్యార్థులకు కొంత అనుకూలం. శ్రమ పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం. సహోద్యోగుల సహకారం ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు పొందుతారు. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు అనుకూలం. శివారాధన మంచిది.
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూమి కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. నిత్యం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. బంధువర్గంతో కార్యసిద్ధి ఉంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆదరణ లభిస్తుంది. ఏకాగ్రత, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
ఈ వారం ఖర్చుల నియంత్రణ అవసరం. పనుల్లో జాప్యం పెరుగుతుంది. రాబడిపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో అసంబద్ధ నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లవచ్చు. ఆత్మీయుల సలహాతో కొంత మేలు జరుగుతుంది. వ్యాపార, ఆర్థిక లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు. అయితే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. సూర్యారాధన మేలుచేస్తుంది.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషం పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పదోన్నతి మూలంగా స్థాన చలనం ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
తలపెట్టిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. శ్రేయోభిలాషుల సూచనలను పాటించండి. విద్యార్థులకు కలిసివస్తుంది. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. వ్యాపార భాగస్వాములతో అనుబంధం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభాన్ని కలగజేస్తుంది.
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇరుగు పొరుగుతో సంబంధాలు మెరుగవుతాయి. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థికాంశాల్లో తొందరపాటు తగదు. విద్యార్థులకు మంచి సమయం. హనుమాన్ చాలీసా పఠించండి.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు గతంలో కన్నా అనుకూలం. శివారాధన వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
కొత్త ఉద్యోగంలో చేరతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.