ఆదాయం పెరుగుతుంది. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరచరాస్తుల ద్వారా రాబడి మొదలవుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు.
ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది.
రోజువారీ పనులు లాభదాయకం. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఓపికతో వ్యవహరించండి. ఆరోగ్యంతో ఉంటారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. పనులు వాయిదా పడవచ్చు. వారాంతంలో పరిస్థితులు సానుకూలం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక కార్యక్రమాలను చేపడతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవకార్యాలకు సాయం చేస్తారు.
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం, వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు.
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ఓపిక అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. రాబడిని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు.
న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికీ సహాయపడే మనస్తత్వం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తోటివారితో విభేదాలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. కొంత సంయమనం అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్తవస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. భూ లావాదేవీల్లో కాలయాపన ఉండవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి విందులు, వినోదాలకు హాజరవుతారు.
ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో మెలగడం అవసరం. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ పనుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు.