పనిలో సంతృప్తిగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పాత బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ఆదరణ పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు.
గతంతో పోలిస్తే ఈ వారం అనుకూలం. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. వ్యాపారులు శ్రమించాల్సి వస్తుంది. నూతన ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. నిలిచి పోయిన పనుల్లో కదలిక వస్తుంది. రాబడి మార్గాలపై దృష్టి
సారిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమయపాలన పాటిస్తారు. న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ఆఫీసులో అందరితో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పట్టుదలతో ముందుకుసాగుతారు. ఆర్థిక సమస్యలు చికాకుపెడతాయి. కానీ సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా కొనసాగుతాయి. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడతారు. అదృష్టం కలిసివస్తుంది. గృహ నిర్మాణం, భూముల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక ఊరట లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పట్టుదలతో పనులు చేపడతారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, లోటు ఉండదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సహోద్యోగుల సహకారం పొందుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వాహనం కొంటారు. కుటుంబంలో అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొన్ని సర్దుబాట్లు అవసరం పడతాయి.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అధికారుల అండ దండలు లభిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ, ఆదాయం పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు.
పట్టుదలతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కోర్టు పనులలో సత్ఫలితాలు వస్తాయి. మంచివారి సహకారం లభిస్తుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. రావలసిన డబ్బుఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు కొంత అందుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కళాకారులకు కాలం కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
రావలసిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఇంట్లోవాళ్లు సూచించిన సలహాలు పాటిస్తారు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూ లావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికారులతో సఖ్యత నెలకొంటుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.