మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో వాటిని నిర్వర్తిస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. అందుకు తగ్గ రాబడి కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
చాలాకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన వారం. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడులకు అనుకూలమైన వారం. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వారాంతంలో కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి.
సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలు పాటిస్తారు. శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ప్రతిఫలమూ ఉంటుంది. అధికారులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏకాగ్రత అవసరం. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఉద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొన్నిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది.
కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పెద్దల సలహాలను పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని విషయాలను ఇంట్లోవారితో చర్చించడం వల్ల పరిష్కారం లభించవచ్చు. సహోద్యోగులు, అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది.
రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయోచిత నిర్ణయాల వల్ల లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
పాతబాకీలు వసూలు అవుతాయి. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. పెద్దల సలహాలు ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా కర్తవ్య నిర్వహణపై మనసు నిలపడం మంచిది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు.
ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారాంతానికి అన్నీ సర్దుకుంటాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కొత్త పనులు కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఖర్చులు పెరిగినప్పటికీ, అందుకు తగిన రాబడి ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. స్నేహితులు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సమాజంలో ఉన్నతస్థితిలో ఉన్నవారితో పరిచయం ఏర్పడుతుంది. గతంతో పోలిస్తే సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శుభకార్యాలపై మనసు నిలుపుతారు.
కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రాబడిలో అస్థిరత నెలకొంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పట్టుదల అవసరం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. గతంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి.
సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సలహాలను ఆచరణలో పెడతారు. ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గంతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది.