స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. తొలుత ఆటంకాలు ఎదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. తగాదాలకు దూరంగా ఉండటం అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. విహారయాత్రలు చేపడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. భూముల కొనుగోలు వ్యవహారం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు విదేశీయాన యోగం. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. తీర్థయాత్రలను చేపడతారు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. రాజకీయంగా అనుకూల వారం. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.
ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల లాభపడతారు. సహోద్యోగులతో మాటపట్టింపులు ఉండవచ్చు. అయితే, అధికారుల ఆదరణ లభిస్తుంది. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. సాహసంతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కొన్ని పనులలో కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. శుభకార్యాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదృష్టం కలిసివస్తుంది. కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాలలో విజయం చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. బంధువర్గం కలిసివస్తుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ, మంచి పేరు తెచ్చుకుంటారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపడతారు. వ్యాపారులకు భాగస్వాములతో కలిసివస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం. రెట్టింపు శ్రద్ధతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు ఏర్పడవచ్చు. వాహనాల రిపేర్లు, భూముల విషయంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. భక్తి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దగ్గరివారితో పనులు నెరవేరుతాయి. సామాజికంగా గుర్తింపు పొందుతారు.
స్నేహితుల వల్ల కలిసివస్తుంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. తల్లిదండ్రుల సలహాతో పనులు పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు లాభిస్తాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇంటి మరమ్మతులు, నూతన నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు.
బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త పరిచయాలు అనుకూలిస్తాయి. భూ తగాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ప్రేరణతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల మూలంగా ధనవ్యయం, అలసట ఉండవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనులలో కాలయాపన, ఖర్చులు ఉంటాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బదిలీ అవకాశం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. బంధువర్గ సహకారం ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. అయితే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన డబ్బు సమయానికి రాకపోవడంతో, చేబదులు అవసరం ఏర్పడవచ్చు. శ్రమ పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రల వల్ల ఖర్చులు భారీగా పెరగవచ్చు. వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికాంశాల్లో ముందు జాగ్రత్త అవసరం.
తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పూర్వం ఉన్న ఇబ్బందులు దూరమవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శ్రమ పెరిగినప్పటికీ, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనులు పూర్తి చేసుకోవడంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
ఆర్థిక సమస్యలతో పనులలో జాప్యం జరుగుతుంది. అన్నదమ్ములు, బంధువర్గం సహకారం లభిస్తుంది. భూ వ్యవహారం కొంత వరకు లాభిస్తుంది. వాహన క్రయ విక్రయాల మూలంగా లాభం జరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు కొంత అనుకూల సమయం. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. సరిపడా ఆర్థిక వనరులు లేక నిర్మాణ పనులు కుంటుపడతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం.
శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. అయితే, చేతిలో డబ్బు లేకపోవడంతో కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. శారీరక శ్రమ ఉండవచ్చు. ప్రయాణాలు విజయవంతంగా కొనసాగుతాయి. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. స్థానచలన సూచన. వ్యాపారులకు కలిసి వస్తుంది. కొత్త పనులు చేయడంపై మనసు పెడతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లవచ్చు. అనుభవజ్ఞుల సూచనల మేరకు పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కార్యసాఫల్యం ఉంటుంది. కొత్త పరిచయాలతో వివాదాలు ఏర్పడవచ్చు. రాజకీయంగా బాగా కలిసివస్తుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. వివాహాది శుభకార్యాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పెద్దలతో విభేదాలు ఉండవచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.