వ్యాపారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. సూర్యారాధన శుభప్రదం.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉన్నత విద్య ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. సహోద్యోగులతో సంయమనంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. శివాలయాన్ని సందర్శించండి.
అదృష్టం కలిసివస్తుంది. కార్యసిద్ధి ఉంది. గతంలో నిలిచి పోయిన పనులు పునఃప్రారంభిస్తారు. విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రారంభించిన పనుల్లో బాధ్యత పెరుగుతుంది. పట్టుదల అవసరం. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బుఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అందరితో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో
విభేదాలను పరిష్కరించుకుంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనం పొందుతారు. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూల సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంతో కాలం గడుపుతారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వినోదాలలో పాల్గొంటారు. విష్ణు ఆరాధన శుభప్రదం.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా, అవసరానికి డబ్బు అందుబాటులో ఉంటుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో కొంత మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించడం అవసరం. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. వాహనం,భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. అందరి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. విద్యార్థులు మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. శివారాధన మేలుచేస్తుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ పనులునిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలనం పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత. బంధువుల రాకతో ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దుర్గాదేవి ఆలయం సందర్శించండి.
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వారాంతంలో ఊహించని విజయం. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. హనుమత్ ఆరాధన శుభప్రదం.
నూతన నిర్మాణాలు చేపడతారు. సహోద్యోగుల సహకారంలభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన అవకాశం. నలుగురికీ సాయపడతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలుచేస్తుంది.