Weekly Horoscope | మేషం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు వ్యవహారాల్లో అదృష్టం కలిసివస్తుంది. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి ఉంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
వృషభం
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తిస్తారు. అధికారులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వృథా ఖర్చులు ఉంటాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులకు అనుకూలమైన వారం. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం.
మిథునం
రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. రాబడి మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వృథా చర్చలకు దూరంగా ఉండాలి. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
కర్కాటకం
ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. భూ లావాదేవీలు అనుకూలం. అన్నదమ్ములు, బంధువర్గంతో కార్యసిద్ధ్ది ఉంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన కుదురుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.
సింహం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విహారయాత్రకు వెళ్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. వారాంతంలో మంచి మార్పు కలుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.
కన్య
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారు. బంధువర్గంతో మాటపట్టింపులు రావచ్చు. చాలాకాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో మీకు అడ్డుతగిలే వ్యక్తులకు సరైన గుణపాఠం చెబుతారు. రోజువారీ వ్యాపారం సజావుగా కొనసాగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీల్లో ఆచితూచి స్పందించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. ఇరుగుపొరుగు సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
తుల
ఆదాయం సంతృప్తికరం. ఆర్థికంగా చికాకులు ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తిస్తారు. పట్టుదలతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆస్తి తగాదాలు ముందుకురావచ్చు. బంధువర్గం కారణంగా ఆర్థికంగా నష్టం వాటిల్లవచ్చు. భూములు, వాహనాల కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అధికారులతో సఖ్యత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ, వాటిని సమర్థంగా నిర్వర్తిస్తారు. భూ లావాదేవీల్లో లాభం చేకూరుతుంది. సోదరులతో కార్యసిద్ధి ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విహారయాత్రకు వెళ్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలను కట్టిపెట్టండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ధనుస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు మంచి సమయం. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆత్మీయులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం.
మకరం
ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రాబడి మార్గాలు పెంచుకునే ఆలోచన చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరచరాస్తి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. బంధువర్గంతో కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యంగా ఉంటారు.
కుంభం
ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. రాబడి పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. సహోద్యోగులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు.
మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. స్థిర చరాస్తి మూలకంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. కళాకారులను కొత్త అవకాశాలు పలకరిస్తాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అన్నదమ్ములు, బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. కార్య సాఫల్యం ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు.