ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్నచిన్న విషయాలకే హైరానా పడుతుంటారు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వారం మధ్యలో మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. మాతృవర్గం సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. బహుమతులు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభఫలితాలు పొందుతారు.
శారీరక సమస్యలు తీరిపోతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. గిట్టనివారితో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వృథా ఖర్చులు ముందుకురావచ్చు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన అవసరం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. కొత్త పనులు చేపట్టకుండా.. చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించడం అవసరం. సంయమనంతో వ్యవహరించాలి. విదేశీయాన ప్రయత్నాలు వాయిదాపడతాయి. వైష్ణవాలయ దర్శనం మేలు చేస్తుంది.
ఈ వారం శుభప్రదం. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పనులు చెడగొట్టడానికి గిట్టనివారు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాలయాపన వద్దు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన ముందుకు కదలవు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. భూమి కొనుగోలు, వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల ఊహించని సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య యత్నాలు సఫలమవుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. వ్యాపారులకు మంచి సమయం. ఆర్థికంగా పుంజు కుంటారు. అదృష్టం కలిసివస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.
ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయుల సూచనలు అమలుచేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సమయపాలన అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. శివారాధన వల్ల శుభఫలితాలు అధికమవుతాయి.
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కళారంగంలో ఉన్న
వారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి అధికం. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అన్నదమ్ములతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
గురు, రాహు సంచారం వల్ల సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట. రాబడికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు పోవద్దు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.