చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భాగస్వాముల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. భూ వివాదాల్లో తలదూర్చకండి. సంయమనం అవసరం. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు.
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పనులు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు స్థానచలన అవకాశాలు ఉన్నాయి. గృహనిర్మాణ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించడం మంచిది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది.
ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు అందుతాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. కార్యసిద్ధి ఉంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. రాబడికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
వ్యాపారులకు అనుకూలం. తాత్కాలిక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్టు కేసులలో తాత్కాలిక ఊరట లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక వనరుల లేమితో పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వివాహ ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీరంగంలో ఉన్నవారికి ఊహించని అవకాశాలు వస్తాయి. వ్యాపారులు
సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. పాతబాకీలు వసూలు అవుతాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. జీవన విధానంలో మార్పులను ఆహ్వానిస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచివ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల కార్య సాఫల్యమూ ఉంది. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉత్సాహంగా హజరవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.
ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల అలసట పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువుల రాకతో అనుకోని ఖర్చులు ముందుకొస్తాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. ఈ వారం పట్టుదల, ఏకాగ్రత అవసరం. ఆహార నియమాలు పాటిస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది.
పనులను సకాలంలో పూర్తిచేస్తారు. సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వాహన మరమ్మతులు రావచ్చు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. వారాంతంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనుల్లో సర్దుబాట్లు అవసరమవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి రావచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. పెద్దల సలహాలు పాటించండి. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి స్పందించండి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. పనులపై మనసు నిలపడం అవసరం.
పూర్వం పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి.
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. బాధ్యతతో వ్యవహరిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. అధికారుల అండదండలు లభిస్తాయి. కళాకారులకు జీవితాన్ని మలుపుతిప్పే అవకాశాలు.