ప్రయాణాలు కలిసివస్తాయి. పనులు శ్రద్ధగా చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. మాటతో అందరి మనసులూ గెలుచుకుంటారు. గతంలో అనుకున్న ప్రణాళికలు అమలు చేయడానికి ఈ వారం అనుకూలం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. అందుకు తగ్గ గుర్తింపూ లభిస్తుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
చాలా పనుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్నేహితులతో మనస్పర్ధలు రావచ్చు. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. వాహన మరమ్మతులు ముందుకు రావొచ్చు. సోదరులతో స్థిరాస్తి లావాదేవీల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు మిశ్రమ కాలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
కుటుంబంతో సంతోషంగా గడపుతారు. చేతినిండా డబ్బులు ఉంటాయి. కొత్త ఇల్లు, స్థలం కొనుగోలు విషయంలో ముందడుగు వేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు ఆర్జిస్తారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒత్తిడిని జయిస్తారు. ఉద్యోగులకు మంచి కాలం. పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. ఆరోగ్యంగా ఉంటారు. రామరక్ష స్తోత్రం పఠించండి.
పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. అనుకూల బదిలీకి అవకాశం ఉంది. సమయానికి సాయం చేసేవారు ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ మాటతీరుతో పెద్దల మన్ననలు పొందుతారు. పెద్దతు విలువైన సలహాలు అందిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.
ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్న పనులపై దృష్టి సారించండి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. భూ వివాదాలు ఏర్పడవచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. ముఖ్యమైన పనుల్లో పెద్దలు సహకరిస్తారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.
విహారయాత్రలు చేపడతారు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓపికతో పనులు పూర్తిచేయడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. బంధువర్గం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. పనుల్లో కాలయాపన, వృథా ఖర్చులు ఉండవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శుభప్రదం.
ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. అధికారుల ఆదరణ పొందుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in